https://oktelugu.com/

Wipro Elite National Talent Hunt: విప్రోలో 30,000 ఉద్యోగ ఖాళీలు.. బీటెక్ అర్హతతో..?

Wipro Elite National Talent Hunt: ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలలో ఒకటైన విప్రో నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి విప్రో సిద్ధమైంది. విప్రో ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ పేరుతో ఈ సంస్థ 30,000 మంది ఫ్రెషర్స్ ను నియమించుకోనుందని తెలుస్తోంది. 2022 సంవత్సరంలో బీటెక్ ఫైనల్ ఇయర్ పూర్తయ్యే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. https://careers.wipro.com/elite వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 31, 2021 / 04:47 PM IST
    Follow us on

    Wipro Elite National Talent Hunt: ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలలో ఒకటైన విప్రో నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి విప్రో సిద్ధమైంది. విప్రో ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ పేరుతో ఈ సంస్థ 30,000 మంది ఫ్రెషర్స్ ను నియమించుకోనుందని తెలుస్తోంది. 2022 సంవత్సరంలో బీటెక్ ఫైనల్ ఇయర్ పూర్తయ్యే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.

    https://careers.wipro.com/elite వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ తీర్రి డెలపోర్టే భారీస్థాయిలో ఉద్యోగుల అవసరం ఉండటంతో 30,000 మందిని నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్‌ 15, 2021 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వారికి సెప్టెంబర్‌ 25, 27 తేదీలలో ఆన్ లైన్ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ జరుగుతుంది.

    25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి ఏడాదికి 3,50,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు 12 నెలల సర్వీస్ అగ్రిమెంట్ ఇవ్వాలి. దరఖాస్తు చేసుకునే వాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ చదువుతున్న వాళ్లై ఉండాలి.

    ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటీవ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ (వర్బల్) ఎబిలిటీ, ఎస్సే రైటింగ్ ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ఫీచరింగ్ ఉంటుంది. టెన్త్, ఇంటర్‌లో 60 శాతం పైగా మార్కులు సాధించిన వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కొసం దరఖాస్తు చేసుకోవచ్చు.