
కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన అంతరాష్ట్ర బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28నుంచి తెలంగాణ నుండి కర్ణాటక, మహారాష్ట్ర లకు బస్సు సర్వీసులు ప్రారంభం కాగా ఏపీ తెలంగాణ మధ్య బస్సు సర్వీసుల విషయంపై చర్చల తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.