
విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, పచ్చదనానికి గాను ఈ గుర్తింపు దక్కింది. ఈ మేరకు ఆలయ ఈవో సూర్యకళకు మంత్రి అవంతి శ్రీనివాస్ ఐఎస్ వో ధ్రువపత్రం అందజేశారు. కేంద్ర ప్రసాదం పథకం కింద సింహాద్రి అప్పన్న ఆలయానికి రూ. 53 కోట్లు వచ్చినట్లు ఈవో తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.