
మంత్రి ఈటల రాజేందర్ తమ భూములను కబ్జా చేశారన్న రైతుల ఫిర్యాదు పై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. శనివారం ఉదయం మూపాయిపేట మండలం అచ్చంపేటకు చేరుకున్న అధికారులు మంత్రిపై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అసైన్డ్ దారులను ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్నారు. తూప్రాన్ ఆర్టీవో రాం ప్రకాశ్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలతో గ్రామంలోని భూములను సర్వే చేస్తున్నారు.