
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలంతో ఇతర దేశాలు భారత్ పేరు చెబితేనే వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ లో ఉన్న వాళ్లపై ఆస్ట్రేలియాలో అడుగు పెట్టడం పై నిషేధం విధించింది. ఇది ఎవరైనా అతిక్రమిస్తే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. తమ పౌరులు స్వదేశానికి తిరిగి రావడమే శిక్షార్హమైన నేరంగా పేర్కొంటోంది.