డిజిటల్ యుగంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఫుల్ క్రేజ్ క్రియేట్ అయింది. సోషల్ మీడియా ఎకౌంట్ లో ఫాలోవర్స్ ఎంత ఎక్కవ మంది ఉంటే, అంతగా పాపులారిటీ ఉన్నట్టు.. సినిమా ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీస్ కి కూడా సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉంటే అది అంత పెద్ద బలం అన్నట్టుగా తయారైంది. ఇప్పటికే అల్లు అరవింద్ అడ్వాన్స్ డ్ గా ఆలోచించి సొంత ఓటీటీ-ఆహాను నెలకొల్పి దాన్ని ఫుల్ సక్సెస్ చేశారు.
కేవలం ఏడాది కాలంలోనే ఆహాకి విశేష ఆదరణ దక్కింది. పైగా డిజిటల్ కంటెంట్ విషయంలో కూడా అల్లు అరవింద్ చాల కొత్తగా ఆలోచించారు. అందుకే అల్లు అరవింద్ విజయవంతంగా తన ఆహాను నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీకి భవిష్యత్తు ఉందని మిగిలిన వాళ్లకు కూడా అర్ధమైంది. అసలుకే తెలుగు ఇండస్ట్రీలో కింగ్ నాగార్జునకి బడా బిజినెస్ మేన్ గా మంచి పేరు ఉంది.
ఎలాగూ ఓటిటీకి సక్సెస్ ఫుల్ ఫ్యూచర్ ఉందని నేటి పరిస్థితులు ప్రూవ్ చేస్తున్నాయి కాబట్టి.. తానూ ఎందుకు ఓటిటీ సంస్థను పెట్టకూడదు అని ఆలోచనలో పడ్డాడట నాగ్. పైగా థియేటర్లతో సంబంధం లేకుండా ఓటీటీలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీనికి తోడు కరోనా కూడా ఓటిటీలకు పెద్ద ప్లస్ అయింది. జనం థియేటర్స్ కి వెళ్లడం మానేసారు. చక్కగా ఇంట్లోనే కూర్చుని ఓటిటీలో తమకు నచ్చిన సినిమాని చూసుకుంటున్నారు.
అన్నిటికి మించి ఓటీటీలో నష్టాలు తక్కువుగా కనిపిస్తున్నాయి. పైగా అక్కినేని కుటుంబంలో కూడా ఐదుగురు హీరోలు ఉన్నారు. ఏడాదికి అక్కినేని ఫ్యామిలీ నుండి ఏడు ఎనిమిది సినిమాలు వస్తున్నాయి. అలాగే అక్కినేని బ్యానర్ పై చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ ఉంటారు. అక్కినేని ఫిల్మ్ స్కూల్ నుండి కూడా స్టూడెంట్స్ ఏడాదికి వందల మంది బయటకు వస్తున్నారు. వారికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.
అందుకే మెగాస్టార్ తో లేదా మరో పార్ట్నర్ తో కలిసి నాగార్జున సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి కింగ్ నాగార్జునతో ఎవరు భాగస్వామ్యం అవుతారో చూడాలి. ఇక ఇప్పటికే నాగార్జున ఓ రెండు జాతీయ స్థాయి వెబ్ సిరీస్ లలో నటించబోతున్నాడు. ఎలాగూ సమంత కూడా వెబ్ సిరీస్ ల పై ఆసక్తి చూపిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 లో ఆమె ఆల్ రెడీ