
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు చింతలపల్లికి చేరుకుని దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. శామీర్ పేటలోని కట్ట మైసమ్మ ఆలయంలో రేవంత్ సహా నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి మూడు చింతలపల్లి దీక్షా శిబిరం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా తరలి వచ్చారు.