YS Sharmila: మా ఇంటికి రావద్దమ్మా.. షర్మిలకు నిరుద్యోగి కుటుంబం షాక్

YS Sharmila Deeksha: తెలంగాణలో తన దారి.. రహదారి అంటూ దూసుకొచ్చిన వైఎస్ షర్మిల(YS Sharmila)కు ఆదిలోనే హంసపాదు ఎదురవుతున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల పార్టీ నుంచి కీలక నేతలు అందరూ ఒక్కొరొక్కరుగా జారిపోతుంటే దిక్కుతోచని స్థితిలో పడ్డ షర్మిలకు ఇప్పుడు తెలంగాణ ప్రజల నుంచి కూడా సానుభూతి, మద్దతు రాకపోవడం చర్చనీయాంశమైంది. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గతంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు […]

Written By: NARESH, Updated On : August 24, 2021 1:47 pm
Follow us on

YS Sharmila Deeksha: తెలంగాణలో తన దారి.. రహదారి అంటూ దూసుకొచ్చిన వైఎస్ షర్మిల(YS Sharmila)కు ఆదిలోనే హంసపాదు ఎదురవుతున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల పార్టీ నుంచి కీలక నేతలు అందరూ ఒక్కొరొక్కరుగా జారిపోతుంటే దిక్కుతోచని స్థితిలో పడ్డ షర్మిలకు ఇప్పుడు తెలంగాణ ప్రజల నుంచి కూడా సానుభూతి, మద్దతు రాకపోవడం చర్చనీయాంశమైంది.

తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గతంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్లు జారీ చేసే వరకు కూడా ఉద్యమాన్ని ఆపకూడదని డిసైడ్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నడుం బిగించింది. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలివ్వాలని షర్మిల 72 గంటల పాటు దీక్ష చేపట్టింది. అయినా ప్రభుత్వ స్పందన నాడు రాలేదు. ఇప్పుడు ప్రతి మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాలు రాక చనిపోయిన నిరుద్యోగుల కుటుంబాల వద్ద దీక్ష చేస్తున్నారు.

తాజాగా ఈరోజు 24వ తేదీన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ లో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టాలని భావించిన వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. దీక్షకు అంతా సిద్ధం చేసిన వేళ దీక్ష కోసం మా ఇంటికి రావద్దంటూ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నరేశ్ తండ్రి షర్మిలకు విజ్ఞప్తి చేశారు. దీంతో దీక్షకు అన్ని ఏర్పాట్లు చేసిన వైఎస్ఆర్ టీపీ నాయకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వేరే చోట దీక్షను ఏర్పాటు చేశారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగపూర్ కు చెందిన నరేశ్ డిగ్రీ చదివి ప్రభుత్వం కోసం ఎదురుచూస్తూ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ముగ్గురు అన్నలు ప్రభుత్వ ఉద్యోగులే. ఇతడు తనకు రాలేదని సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు షర్మిల తమ ఇంటి ముందు దీక్ష చేపడితే తన మిగతా ముగ్గురు కొడుకుల ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుందని.. దయచేసి మా ఇంటికి రావద్దని నరేశ్ తండ్రి షర్మిలకు విజ్ఞప్తి చేశారు. నాయకులను తన ఇంటి వద్ద దీక్ష చేపట్టవద్దని స్పష్టం చేశారు. దీంతో హుటాహుటిన నాయకులు వేర చోటకు తరలించారు.