Indian Army Bhairav Battalion : ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు తెలిశాయి. ముఖ్యంగా మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా మన సామర్థాలు చూసి షాక్ అయ్యాయి. అమెయికా అయితే వణికిపోయింది. పాకిస్తాన్‌లోని దాని అణ్వాయుధాలు ఉండడంతో వెంటనే రంగంలోకి దిగిన ట్రంప్.. సీజ్‌ఫైర్‌కు ఒప్పించారు. ఈ క్రమంలో భారత్ సైనిక శక్తిని మరింత బలోపేతం చేస్తోంది. ఇటీవలే రూ.75 వేల కోట్ల బడ్జెట్ విడుదల చేసింది. మరోవైపు ఆరు నెలలుగా ఆర్మీలో భైరవ్ బెటాలియన్స్ తయారు చేస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడని తిప్పి కొట్టినా.. భవిష్యత్‌లో డ్రోన్ దాడుల ప్రాముఖ్యతను గుర్తించింది. దీంతో భారత సైన్యం డ్రోన్ సాంకేతికతను మార్పుపై దృష్టి సారించింది. కాలభైరవ మంత్ర ఆధారంగా భైరవ్ పేరుతో ప్రత్యేక యూనిట్లు తయారు చేస్తోంది. దీంతో శత్రు బలగాల్లో వణుకు మొదలైంది. 2025 మూడో త్రైమాసంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ఇప్పటికే 15 బెటాలియన్లను సిద్ధం చేసింది. మిగిలిన 10 కూడా త్వరలో పూర్తి అవుతాయి.
డ్రోన్ సామర్థ్యా బలోపేతమే లక్ష్యంగా..
భైరవ్ బెటీలియన్లు 15 ఉండగా, ప్రతీ బెటాలియన్‌లో 250 మంది యోధులు ఉంటారు, వీరు ఒకేసారి లక్షలాది డ్రోన్లను నడిపే సామర్థ్యం కలిగి ఉంటారు. టాక్టిక్స్, టెక్నిక్స్, ప్రొసీజర్స్ (టీటీపీ) అనే మూల సూత్రాలను పూర్తిగా ఆధునీకరించి అమలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ ఉపయోగాలను అధ్యయనం చేసి, భారతదేశం ఎదుర్కొంటున్న సరిహద్దు సవాళ్లకు అనుగుణంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు.
కఠిన శిక్షణ..
ఎంపిక ప్రక్రియలో కఠిన పరిస్థితులు, వివిధ వాతావరణాలకు తట్టుకునే సామర్థ్యం కలిగినవారిని మాత్రమే తీసుకుంటారు. ఐదు నెలల శిక్షణలో రెక్కీ, వ్యూహ నిర్మాణం, టెక్నికల్ అమలు, శత్రు కార్యకలాపాలు ధ్వంసం వంటి నైపుణ్యాలు నేర్పిస్తారు. ఫలితంగా, క్రాస్–బార్డర్ ఆపరేషన్లు, ర్యాపిడ్ దాడులు, కచ్చితమైన గూడచర్యాల్లో నిపుణులుగా మారతారు. ఇది రుద్ర బ్రిగేడ్ వంటి మునుపటి కార్యక్రమాలకు అదనంగా ఒక మైలురాయి.
మూడు సైన్యాల సమ్మేళనం..
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మధ్య సమన్వయానికి రాజస్థాన్‌లో ’అఖండ పహార్’ వ్యాయామాలు నిర్వహించారు. జాయింట్ ఆపరేషన్లు, స్వదేశీ సాంకేతికతలు, నూతన ఆలోచనలపై దృష్టి పెట్టి, భైరవ్ బెటాలియన్లు భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి.