
పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ ఫైనల్ కు చేరింది. ఈ విభాగంలో భారత షూటర్ సౌరభ్ చౌదరీ ఫైనల్ కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్ లో చౌదరీ అగ్రస్థానంలో నిలిచాడు. 586 పాయింట్లతో సౌరభ్ చౌదరీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఈ విభాగంలో భారత షూటర్ అభిషేక్ వర్మ అర్హత సాధించలేకపోయాడు. 575 పాయింట్లతో అభిషేక్ వర్మ 17వ స్థానంలో నిలిచాడు.