ఎన్నికల్లో ఓడిపోతే అధికార మార్పిడికి ఒప్పుకోను: ట్రంప్ సంచలనం

‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అన్నట్టు మన పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్షరాల పాటిస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో నియంత పోకడలకు పోతున్నారు. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే శాంతియుత అధికార బదిలీకి కట్టుబడి ఉండడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. పోస్టల్ ఓటింగ్ మీద తనకు సందేహాలు ఉన్నాయని.. ఎన్నికల ఫలితాలు చివరకి అమెరికా సుప్రీం కోర్డుకు కూడా చేరవచ్చని […]

Written By: NARESH, Updated On : September 24, 2020 8:00 pm
Follow us on

‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అన్నట్టు మన పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్షరాల పాటిస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో నియంత పోకడలకు పోతున్నారు. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే శాంతియుత అధికార బదిలీకి కట్టుబడి ఉండడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. పోస్టల్ ఓటింగ్ మీద తనకు సందేహాలు ఉన్నాయని.. ఎన్నికల ఫలితాలు చివరకి అమెరికా సుప్రీం కోర్డుకు కూడా చేరవచ్చని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: కాశ్మీర్ పై పాకిస్తాన్ కధ కంచికే

ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓడిపోతే అధికార మార్పిడి చేయను అన్న ట్రంప్ మాటలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో నియంతలా ట్రంప్ మాట్లాడడం అందరినీ షాక్ కు గురిచేసింది. విలేకరుల సమావేశంలో ఓ జర్నలిస్టు ‘అద్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే అధికార మార్పిడికి సామరస్యంగా కొనసాగిస్తారా?’ అని ప్రశ్నించగా.. ట్రంప్ షాకింగ్ సమాధానం ఇచ్చాడు. సుప్రీం కోర్టుకు వెళుతానని.. అంత ఈజీగా అధికార మార్పిడి చేయను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పోస్టల్ ఓటింగ్ పై తన వ్యతిరేకతను తాజాగా విలేకరుల సమావేశంలో చాటుకున్నారు.

అమెరికా ఎన్నికల్లో బ్యాలెట్ గురించి గట్టిగా ఫిర్యాదు చేస్తున్నానని.. బ్యాలెట్స్ ఒక విపత్తు లాంటిది అని ట్రంప్ సమాధానం ఇచ్చారు. బ్యాలెట్ ను వదిలించుకుందాం అని.. అప్పుడే అందరికీ ప్రశాంతంగా ఉంటుందని.. ఎన్నికల్లో పారదర్శకత పెరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

కరోనా మహమ్మారి వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎక్కువ రాష్ట్రాలు పోస్టల్ ఓటింగ్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో గోల్ మాల్ జరిగే అవకాశం ఉందని ట్రంప్ అనుమానిస్తున్నారు.

Also Read: స్వతంత్ర రైతు సంఘాలే కావాలి నినాదం

2016లో డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తో పోటీపడ్డప్పుడు కూడా ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి ట్రంప్ నిరాకరించారు. అమెరికా ప్రజాస్వామ్యంపైనే దాడికి దిగారు. ఆ ఎన్నికల్లో 30 లక్షలకుపైగా ఓట్లను కోల్పోయినప్పటికీ ట్రంప్ విజేతగా నిలిచారు. ఆ ఫలితాలపై ఇప్పటికీ ట్రంప్ కు సందేహాలు ఉన్నాయి.