India vs Zimbabwe: తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు వైట్ వాష్ ఫలితాన్ని అందించింది. ఐర్లాండ్ కొట్టిన దెబ్బకు టీమిండియా దిమ్మ తిరిగిపోయింది. ఆ దెబ్బనే సాలిడ్ గా ఉంది అనుకుంటే.. ఇంగ్లాండ్ మరింత దారుణంగా కొట్టింది. ఏకంగా నాలుగు మ్యాచ్లో ఓడించి.. నేల నాకించింది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. టీమిండియా రెండు టీ20 సిరీస్ లనూ ఓడిపోవడం ఒకరకంగా ఆందోళన కలిగించే విషయం.
ఈ వరుస ఓటముల నేపథ్యంలో టీమిండియా జింబాబ్వేతో నేటినుంచి 3 t20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లన్నీ కూడా జింబాబ్వే లోన హరారే మైదానం వేదికగా జరుగుతాయి. వాస్తవానికి జింబాబ్వేతో టి20 సిరీస్ అంటే… ఒత్తిడి మొత్తం ఆతిథ్య జట్టుమీదనే ఉంటుంది. కానీ ఈసారి ఆశ్చర్యకంగా పర్యాటక జట్టు మీద ఒత్తిడి ఉంది. దీనికి ప్రధాన కారణం అయ్యర్ నాయకత్వంలో టీమిండియా అత్యంత దారుణమైన ఆట తీరు కొనసాగించడమే. చివరికి ఐర్లాండ్ జట్టు చేతిలో కూడా టీమిండియా వైట్ వాష్ కు గురవుతోంది అంటే.. మన వాళ్ళ ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. బౌలింగ్ దారుణంగా ఉంటుంది. బ్యాటింగ్ చండాలంగా ఉంటుంది. అసలు ఆటగాళ్లు ఎందుకు ఆడుతున్నారు.. ఎలా ఆడుతున్నారు అనేది అర్థం కావడం లేదు.
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో టీమ్ ఇండియా ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ అయ్యర్ బ్యాటింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. నాయకుడిగా మాత్రం అతడు విఫలమవుతున్నాడు.. జట్టులో ఉన్న ప్లేయర్లను సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో అట్టర్ ప్లాఫ్ అవుతున్నాడు. దీంతో జట్టు మీద విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతోంది. అయ్యర్ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా టి20 ర్యాంకింగ్స్ పడిపోవడం విశేషం. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా ఎన్నడూ కూడా మొదటి స్థానాన్ని కోల్పోలేదు. ఒక్క సిరీస్ కూడా నష్టపోలేదు. పైగా t20 వరల్డ్ కప్ కూడా గెలిచింది. కానీ అయ్యర్ మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు.
జింబాబ్వే జట్టు టీమ్ ఇండియాను సొంత మైదానం మీద ఏకంగా మూడుసార్లు ఓడించింది. ఈసారి కూడా అదే రిపీట్ చేయాలని భావిస్తోంది. దీనివల్ల టీమిండియా ఒత్తిడిలో పడుతుందని.. తద్వారా అద్భుతం చేయవచ్చని ఆ జట్టు ప్లేయర్లు అంచనా వేస్తున్నారు. ఇక జింబాబ్వే జట్టు సారధి సికిందర్ రాజా టీమిండియా కు ముందుగానే హెచ్చరికలు పంపించాడు. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ మాదిరిగానే తాము ఆడతామని.. టీమ్ ఇండియాకు చెక్ పెడతామని సవాల్ విసిరాడు. మరి ఈ సవాల్ ను టీమిండియా ఎలా స్వీకరిస్తుందో చూడాల్సి ఉంది. ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, హర్ష్ దూబే, అశోక్ శర్మ వంటి ప్లేయర్లు జాతీయ జట్టులోకి ప్రవేశిస్తున్నారు. సీనియర్ క్రికెటర్లకు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో.. యంగ్ ప్లేయర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. జింబాబ్వే మీద సత్తా చాటి అదరగొట్టాలి. ఒకవేళ టీమ్ ఇండియా గనుక ఈ సిరీస్ గెలిస్తే చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. ఆ తదుపరి సిరీస్లను స్వేచ్ఛగా ఆడగలుగుతుంది.

