
ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్ శర్మ అర్ధ సెంచరీ చేశాడు. 145 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్ అవుటైన తర్వాత క్రీజుల్లోకి వచ్చిన పుజారాతో కలిసి నిదానంగా ఆడుతున్న రోహిత్ ఇంగ్లిష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. పుజరా కూడా రోహిత్ కు సహకరిస్తూ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి 85 బంతుల్లో 42 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం వికెట్ నష్టానికి 135 పరుగులు చేసిన భారత్ ఇంగ్లాండ్ కంటే 35 పరుగుల ఆధిక్యంలో ఉంది.