
ఇండియా మాకు ముఖ్యమైన దేశం.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వారికి ఎలాంటి ముప్పు ఉండదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. భారతదేశంలో ఆఫ్గనిస్థాన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. తమ పాలనలో కూడా భారత్ తో మంచి సంబంధాలు కొనసాగించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. భారతదేశానికే కాదు ఏ దేశానికి కూడా హానీ కలిగించము. తమ వైపు నుంచి ఇండియాకు ఎలాంటి ముప్పు ఉండదు అని హామీ ఇస్తున్నట్లు జబీహుల్లా స్పష్టం చేశారు.