
తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్ లో కల్లోలం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ పౌరుల కోసం భారత్ కొత్త వీసా కేటగిరీని ఏర్పాటు చేసింది. అఫ్గాన్ దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఈ-ఎమర్జెన్సీ వీసాలను ప్రకటించింది. అఫ్గాన్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీసా నిబంధనలపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేపట్టి వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. భారత్ కు వచ్చేందుకు అఫ్గాన్లు చేసుకున్న వీసా దరఖాస్తుల ఫాస్ట్ ట్రాక్ పరిశీలన కోసం ప్రత్యేక కేటగిరీ ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశ పెట్టింది అని హోంశాఖ అధికార ప్రతినిధి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.