
భారతదేశ గర్వం.. దాని సంప్రదాయ పరిజ్ఞానంలో ఉందని, దానికి ఇతర దేశాలను కాపీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ‘భారత్ వైభవ్‘ పుస్తకావిష్కరణలో మాట్లాడారు. భారతదేశం తన విజ్ఞాన సంప్రదాయాన్ని ప్రపంచమంతా పంచుకునేందుకు పుట్టిందని చెప్పారు. దేశ సమాచారం అన్ని భారతీయ భాషల్లోకి అనువదించి, విస్తృత ప్రచారం చేయాలన్నారు.