India A vs Bangladesh A : ఆసియా కప్ రైజింగ్ స్టార్ టోర్నీలో టీమిండియా ఇంటి బాట పట్టింది. తప్పక గెలవలసిన సెమి ఫైనల్ మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. ప్లేయర్ల పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్ కంటే భారత్ అత్యంత బలమైన జట్టు. కానీ ఒత్తిడిని తట్టుకోలేక టీమిండియా చేతులెత్తేయడాన్ని సగటు అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 17వ ఓవర్ వరకు ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దీంతో మహా అయితే చివరి 3 ఓవర్లో 30 పరుగులు చేస్తోందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే టీమిండియా బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేసింది. బంగ్లా ఆటగాడు మెహరూబ్(48*) చివరి 3 ఓవర్లలో విధ్వంసాన్ని సృష్టించాడు. 18 ఓవర్ లో 11 పరుగులు, 19 ఓవర్ లో 28 పరుగులు, 20 వ ఓవర్లో 22 పరుగులు సాధించాడు. 3 ఓవర్లలోనే బంగ్లా జట్టు 61 పరుగులు సాధించింది. దీంతో టీమ్ ఇండియా ముందు కొండంత లక్ష్యాన్ని విధించింది..
బంగ్లాదేశ్ విధించిన టార్గెట్ ఫినిష్ చేయడంలో రంగంలో దిగిన టీమిండియా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత క్రమక్రమంగా ఒత్తిడికి గురైంది. వికెట్లు కూడా కోల్పోయింది. దీంతో టీమ్ ఇండియా ఓటమి అంచులో నిలిచింది. ఈ క్రమంలో ఆశుతోష్ శర్మ అద్భుతం చేయడంతో టీమిండియా గెలిచేలాగా కనిపించింది. అయితే చివర్లో శర్మ అవుట్ కావడం.. టీమిండియా కు ఒక బంతికి నాలుగు పరుగులు రావాల్సిన చోట మూడు పరుగులు మాత్రమే సాధ్యం కావడంతో మ్యాచ్ టై అయింది. ఈ దశలో సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో సూర్యవంశీ ని పంపించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. అలాకాకుండా జితేష్, అశుతోష్ ను పంపించి పెద్ద పొరపాటు చేసింది.. వారు కూడా ఒత్తిడిలో దరిద్రమైన షాట్లు లు ఆడారు. ఫలితంగా వరుస బంతుల్లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోవడంతో ఆల్ అవుట్ అయింది. సూపర్ ఓవర్ నిబంధన ప్రకారం రెండు వికెట్లు కోల్పోతే జట్టు మొత్తం ఆల్ అవుట్ అయినట్టు ప్రకటిస్తారు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా టీమిండియాకు అలాంటి పరిస్థితి ఎదురైంది.. ఆ మూడు ఓవర్లు.. ఆ రెండు వికెట్లు టీమ్ ఇండియా గనుక కోల్పోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది.