
75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇవాళ విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహ ఇన్ చార్జి సునీల్ దేవదర్, పార్టీ నాయకులు, కార్యకర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు పోరాటం చేస్తే మన దేశానికి స్వతంత్రాన్ని సాధించుకున్నామన్నారు.