Kcr-Kadium: కేసీఆర్ కు షాకిచ్చిన కడియం

రాష్ర్ట ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రవేశపెట్టిన దళితబంధుతో అందరిని ఆకట్టుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ పకడ్బందీ వ్యూహాలు అనుసరిస్తున్నారు. రానున్న రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేసి దళితుల్లో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి, మరొకరిని మంత్రిని చేయాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో దళిత నేతల్లో ఆశలు పెరిగిపోయాయి. అధినేతపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కడియం శ్రీహరి ఒక అడుగు ముందుకేశారు. దళితబంధు పథకంపై కడియం అనుమానాలు వ్యక్తం చేస్తూ […]

Written By: Srinivas, Updated On : August 15, 2021 12:33 pm
Follow us on

రాష్ర్ట ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రవేశపెట్టిన దళితబంధుతో అందరిని ఆకట్టుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ పకడ్బందీ వ్యూహాలు అనుసరిస్తున్నారు. రానున్న రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేసి దళితుల్లో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి, మరొకరిని మంత్రిని చేయాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో దళిత నేతల్లో ఆశలు పెరిగిపోయాయి. అధినేతపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కడియం శ్రీహరి ఒక అడుగు ముందుకేశారు. దళితబంధు పథకంపై కడియం అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో టీఆర్ఎస్ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఇప్పటికే పార్టీలో సీనియర్ నేతలకు పదవులు కట్టబెడుతున్న కేసీఆర్ కు దళిత నేతలు సందేశాలు పంపుతూ తమకు ప్రాధాన్యం కల్పించాలని సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కడియం శ్రీహరి ఇలా దళితబంధు పథకంపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీలో మంచి హోదా పొందిన శ్రీహరికి టీఆర్ఎస్ లో మాత్రం ఎలాంటి ప్రాధాన్యత ఉండడం లేదు.దీంతో ఆయన తన రాజకీయ భవిష్యత్ పై బెంగతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కాకపోయినా కనీసం ఏదో ఒక మంచి పోస్టు ఇవ్వడం లేదనే కినుక వహిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో దళిత నేతలు కేసీఆర్ పై ఒత్తిడి పెంచి తమ పదవులు సాధించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన మనసులో డిప్యూటీ సీఎం కావాలనే కోరిక ఉన్నట్లు సమాచారం. అందుకే కేసీఆర్ పై పరోక్షంగా తన ఇష్టం నెరవేర్చుకునే క్రమంలో ఈ మార్గం ఎంచుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే టీడీపీ నుంచి వచ్చిన వారికి సముచిత ప్రాధాన్యమిచ్చి ఒక్క శ్రీహరిని మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయన తనలోని అసంతృప్తిని బయట పెట్టినట్లు తెలుస్తోంది.

ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇచ్చి అందలం ఎక్కించిన కేసీఆర్ శ్రీహరిని మాత్రం నిర్లక్ష్యం చేశారని సమాచారం. దీంతోనే కడియంలో పెరిగిన అసంతృప్తిని ఈ రూపంలో వెళ్లగక్కుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సీఎం కేసీఆర్ కు దళిత నేతల్తో ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏ మేరకు వారిని సముదాయించి పదవులు కట్టబెడతారో చూడాల్సిందే.