Ind Vs Eng 1st Test Day 4: మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ 8 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. నాలుగో రోజు ఆట ప్రారంభమయ్యాక మొదటి ఓవర్లో చివరి బంతికి భ్రైడన్ కార్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు గిల్. దీంతో టీమ్ ఇండియా 92 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చాడు.