
సీనియర్ రెడిడెంట్ వైద్యులకు స్టైపండ్ ను రూ. 45వేల నుంచి 70 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వారి డిమాండ్లపై సీఎస్ వద్ద చర్చించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా సమయంలో ఆందోళన విరమించుకోవాలని కోరినట్లు స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు వ్యాక్సినేషన్ వేసే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. విదేశాలకు వెళ్లే వ్యక్తుల పాస్ పోర్టు నెంబరు కూడా ఇవ్వాలని సూచించారు.