https://oktelugu.com/

రఘురామపై దాడి.. రాజులపై దాడియేనా?

నరసాపురం ఎంఫీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుతో రాజకీయ దుమారం రేగుతోంది. కులం చిచ్చు ప్రస్తావనకు వస్తోంది. క్షత్రియులపై కక్ష సాధింపు చర్యలంటూ తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. ఇన్నాళ్లు గుర్తుకు రాని కులం ఇప్పుడు ఎందుకు తెరమీదకు వచ్చింది. ఏదైనా జరిగితే కుల ప్రస్తావన తీసుకురావడం పరిపాటిగా మారింది. దీంతో కృష్ణంరాజు వ్యవహారం కాస్త కుల పిచ్చి తలకెక్కుతోంది. రాజకీయాల్లో ప్రతి విషయానికి కులం,మతం ఆపాదించడం సాధారణమైపోయింది. అవసరం ఉన్నాలేకున్నా సామాజికవర్గంలో సింపతి కోసం ప్రయత్నించడం మామూలైపోయింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : May 16, 2021 / 01:00 PM IST
    Follow us on

    నరసాపురం ఎంఫీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుతో రాజకీయ దుమారం రేగుతోంది. కులం చిచ్చు ప్రస్తావనకు వస్తోంది. క్షత్రియులపై కక్ష సాధింపు చర్యలంటూ తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. ఇన్నాళ్లు గుర్తుకు రాని కులం ఇప్పుడు ఎందుకు తెరమీదకు వచ్చింది. ఏదైనా జరిగితే కుల ప్రస్తావన తీసుకురావడం పరిపాటిగా మారింది. దీంతో కృష్ణంరాజు వ్యవహారం కాస్త కుల పిచ్చి తలకెక్కుతోంది. రాజకీయాల్లో ప్రతి విషయానికి కులం,మతం ఆపాదించడం సాధారణమైపోయింది. అవసరం ఉన్నాలేకున్నా సామాజికవర్గంలో సింపతి కోసం ప్రయత్నించడం మామూలైపోయింది. ఎంపీ కృష్ణం రాజు విషయంలో కూడా కులం పేరు ప్రస్తావనకు రావడంతో రాజకీయ రంగు మారుతోంది.

    క్షత్రియులంతా తిరుగుబాటు
    క్షత్రియ వంశానికి చెందిన కృష్ణం రాజు అరెస్టుతో ఏదో జరిగి పోయిందనే విషయాలను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షత్రియులంతా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని చెబుతున్నారు. రాష్ర్ట క్షత్రియ సంఘం అధ్యక్షుడి హోదాలో గొట్టుముక్కల రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. క్షత్రియులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారని స్వరం పెంచారు.

    గతంలో సైతం..
    గతంలో సైతం అశోక్ గజపతి రాజు అరెస్టును కూడా క్షత్రియులపై దాడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అశోక్ గజపతిరాజుపై అక్రమ కేసులు పెట్టారని ప్రస్తుతం అదే సామాజిక వర్గానికి చెందిన రఘురామ కృష్ణం రాజును అరెస్టు చేశారంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. సత్యం రామలింగరాజు విషయంలో కూడా ఇదే విధంగా నానా హంగామా సృష్టించారు. క్షత్రియ వంశంపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.

    మొసలి కన్నీరు
    ఇన్నాళ్లు గుర్తుకురాని కులం ఇప్పుడు ఎందుకు వచ్చిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కృస్ణం రాజు అరెస్టుతో క్షత్రియ కులం ప్రస్తావనతో మొసలికన్నీరు కారుస్తున్నారు. రాజకీయ స్వలాభం కోసం తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. దీంతో కృష్ణం రాజు ఎత్తులు ఫలిస్తాయా అనే మీమాంస అందరిలో నెలకొంది. దీంతో రఘురామ కృష్ణం రాజు కులం పేరుతో సాగించే యాత్రలో ఏ మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.