Sankatahara Chaturthi ప్రతి కార్యక్రమంలో మొదటి పూజను అందుకునే వినాయకుడి ఆశీస్సులు ఉంటే జీవితంలో అన్నీ సంతోషాలు, విజయాలు ఉంటాయని భక్తుల నమ్మకం. అందుకే విఘ్నేశ్వరుడిని నిత్యం కొలుస్తూ ఉంటారు. వినాయక చవితి సందర్భాల్లో వారం రోజులపాటు ఘనమైన పూజలు చేయడంతో ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని భావిస్తారు. అయితే వినాయక చవితి రోజుల్లో మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా విగ్నేశ్వరుడిని ప్రసన్నం చేసుకునే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వాటిలో సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని అంటున్నారు. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థి రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజునే సంకటహర చతుర్థి అని అంటారు. అయితే ఈ రోజున కేవలం పూజలు కాకుండా గణపతి హోమం నిర్వహించడం వల్ల మరిన్ని విశేషాలు కలిగే అవకాశం ఉందని అంటున్నారు. గణపతి హోమం ఎలా నిర్వహించాలి? ఈ పూజల ఫలితం ఎలా ఉంటుంది?
సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ రోజున గణపతి హోమం నిర్వహించడం వల్ల ఆ కుటుంబంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. సంకటహర చతుర్ధి రోజున గణపతి హోమం చేయడం వల్ల గణేశుడు ఎంతో సంతోషిస్తాడని భావిస్తారు. ఈరోజున గణపతి హోమం చేయాలని అనుకునేవారు గణపతి విగ్రహాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దూర్వా గడ్డి తాజా పువ్వులను నెయ్యితో దీపాలు వెలిగించాలి. స్వామివారికి ఇష్టమైన మోదకాలు, లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత సంకట నాశన గణపతి స్తోత్రం చదవాలి. గణపతి హోమం ను ఇంట్లో నీళ్లు కాకపోతే ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా నిర్వహించుకోవచ్చు.
కుటుంబ జీవితం బాగుండడానికి.. ఇంట్లో ఉన్నవారు ఆరోగ్యంగా ఉండేందుకు.. ఉద్యోగం, వ్యాపారాల్లో విజయం సాధించడం కోసం గణపతి హోమం ను నిర్వహించడం వల్ల అనుకున్నవన్నీ జరుగుతాయని చెబుతుంటారు. అలాగే ఇప్పటివరకు ఉన్న కుటుంబ సమస్యలు తొలగిపోయి సంతోషకరమైన జీవితం సాగుతుంది. ఈ గణపతి హోమం సమయంలో చేసే మంత్రోచ్ఛరణం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఒత్తిడి, ఆందోళన తగ్గిపోయి మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఈ హోమంలో విద్యార్థులు పాల్గొంటే వారికి ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే వ్యాపారులకు ఇన్ని రోజులు ఉన్నా కష్టాలు తొలగిపోతాయి. దోష నివారణ తగ్గి శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూలంగా మారుతుంది.
సాధారణంగానే సంకటహర చతుర్థి రోజున నియమ నిష్ఠలతో వినాయకుడిని పూజించడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి. అయితే ఈ రోజు ఉపవాసం ఉండాలని అనుకునేవారు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాతనే సాత్విక భోజనం చేయాలి.