Relationship : పాతకాలంలో పెళ్లి జీవితాన్ని చాలా మంది సీరియస్‌గా తీసుకునే వారు కానీ ప్రస్తుతం పెళ్లి జీవితాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నారు. వైవాహిక బంధంలో ఎన్ని గొడవలు వచ్చినా సరే జీవితభాగస్వామితోనే పంచుకునేవారు. అన్యోన్యతను పంచుకున్నారు. కానీ, లేటెస్ట్ జనరేషన్‌లో వివాహ బంధాన్ని చాలా లైట్‌గా తీసుకునే వారు కూడా ఉన్నారు. ఇటు పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. అటు లవ్ మ్యారేజ్ అయినా కలిసి ఉండటం కష్టమే. చిన్న చిన్న గొడవలే.. పెద్దవాటిగా మార్చుకుంటున్నారు. కొన్ని సార్లు విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
విడాకుల దాకా వెళ్లకూడదంటే సాధారణంగా అనిపించే ఐదు విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లైట్ తీసుకోవద్దు. ఫ్రెండ్స్ మాటలు విని లైట్ తీసుకుంటారు చాలా మంది. కానీ వీటి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీ జీవితంలో కూడా ఇలాంటివి జరిగితే ఓపెన్‌గా మాట్లాడటం మంచిది. అయితే లైట్ తీసుకోకూడని ఆ ఐదు విషయాలు ఏంటి అనుకుంటున్నారా?
పెళ్లి బంధంలో శారీరక సాన్నిహిత్యం చాలా కీలకం. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నారు నిపుణులు. మానసికంగా చాలా ఆనందంగా ఉన్నా.. శారీరకంగా ఇబ్బందులు ఉంటే.. ఆ వివాహ బంధంలో గొడవలు జరుగుతాయి. మీరు ఒకరితో ఒకరు 4 వారాల కంటే ఎక్కువ కాలం శారీరకంగా సన్నిహితంగా ఉండకపోతే అది సాధారణమైన విషయంగా పరిగణించవద్దు. ఈ విషయం మీద ఇద్దరు కలిసి కూర్చోని మాట్లాడాలి. పరిష్కరించుకోవాలి.
భార్యభర్తలు ఒకరికోసం ఒకరు సమయం కేటాయించకపోతే గొడవలు మొదలవుతాయి. మీకు ఒకరికొకరు సమయం ఇవ్వకపోతే కూడా కష్టమే. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. సమయం కేటాయించకపోతే.. భవిష్యతుల్లో మీ సంసార జీవితంలో పొరపొచ్చాలు వస్తాయి. దంపతులు ఒకరి కోసం మరొకరు సమయం కేటాయించుకోవాలి. పెళ్లైన తర్వాత చాలా మంది తమను తాము నిర్లక్ష్యం చేస్తున్నారు. భర్త, అత్తగారిల్లు, పిల్లలు ఇలా కుటుంబ బాధ్యతలకే భార్యలు మొగ్గుచూపుతారు. ఆఫీస్ వర్క్, సంసార బాధ్యతలు అంటూ తమని తాము నిర్లక్ష్యం చేసుకుంటారు కొందరు భర్తలు. దీంతో… కుటుంబం కోసం తీరిక లేకుండా గడుపుతారు దంపతులు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. దంపతులు ఎప్పుడు తామని తాము నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఇద్దరికి కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవాలి.
అన్ని విషయాలు చెప్పకపోకపోయినా సరే వాళ్లే అర్థం చేసుకుంటారులే అనే నమ్మకంతో ఉంటారు దంపతులు. భర్త మనసులోని కోరికలు భార్యకు చెప్పడం చాలా అవసరం. భార్య కూడా తన కోరికలు భర్తే నెరవేరుస్తాడనుకోవడం మంచిది కాదు. మీ సమస్యలు, కోరికలు అన్నీ ఒకరికొకరికి అర్థమయ్యేలా కమ్యూనికేషన్ చేయడం అవసరం. అందుకే భార్య లేదా భర్త మీద అతి నమ్మకం మంచిది కాదు. ఇంట్లో ఏమైనా జరిగితే.. అది భర్తకు చెప్పకుండా.. ఆయన ఏమైనా అనుకుంటారేమో.. అని మానసికంగా అనుకోవద్దు. భర్త కూడా అంతే. ఆఫీసులో ఏమైనా జరిగితే భార్యకి షేర్ చేసుకోవడం అవసరం. ఏమైనా చెబితే అవమానిస్తారని భయపడవద్దు. సాధారణమైన విషయమే భవిష్యత్తులో మీ బంధానికి బీటలు వచ్చేలా చేస్తుంది. మీ సంసార జీవితంలో కూడా ఈ విషయాలు జరిగితే అప్రమత్తంగా ఉండండి. భాగస్వామితో మాట్లాడి సమస్యల్ని పరిష్కరించుకోండి. అప్పటికీ కుదరకపోతే కౌన్సెలింగ్ తీసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..