Senior Citizen Savings Scheme : పదవీ విరమణ తర్వాత కూడా డబ్బు అవసరాలు చాలా ఉంటాయి. కానీ వృద్ధులకు ఎటువంటి ఆర్థిక ఆదాయం ఉండదు. వారికి జీవితకాల మూలధనం అంటే రిటైర్‌మెంట్ ఫండ్ ను ఉపయోగించుకోవచ్చు. వారి సౌలభ్యం ప్రకారం వినియోగించుకుంటారు. వివిధ ప్రదేశాలలో పెట్టుబడి పెట్టడం వలన వారి డబ్బు కాలక్రమేణా పెరుగుతూ వస్తుంటుంది. అయితే చాలా మంది వృద్ధులు పెట్టుబడి విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోరు. వారు హామీతో కూడిన రాబడిని పొందాలి అనుకుంటారు. అందుకే అలాంటి పథకాలలో పెట్టుబడి పెడతారు.
మీరు కూడా అలాంటి పథకం కోసం చూస్తున్నారా? అయితే పోస్టాఫీసులో ఒక పథకం అందుబాటులో ఉంది. ఈ పథకం ద్వారా మంచి వడ్డీని అందుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనే పథకంలో మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం ద్వారా వృద్ధులు కేవలం వడ్డీ నే రూ.12,30,000 పొందుతారు.
ఎంత వడ్డీ వస్తుంది?
ఇదొక డిపాజిట్ పథకం. ఇందులో 5 సంవత్సరాల పాటు నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది.. సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో రూ. 30,00,000 వరకు పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంది. కనీస పెట్టుబడి పరిమితి రూ.1000 గా ఉంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 8.2 శాతం వడ్డీ వస్తుందట.
రూ. 12,30,000 వడ్డీ
మీరు ఈ పథకంలో గరిష్టంగా రూ. 30,00,000 డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ స్కీమ్‌లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాలలో మీరు 8.2% చొప్పున రూ. 12,30,000 వడ్డీని సులభంగా అందుకోవచ్చు. ప్రతి త్రైమాసికంలో రూ.61,500 వడ్డీగా క్రెడిట్ అవుతుంటుంది. ఈ విధంగా 5 సంవత్సరాల తర్వాత మీరు మెచ్యూరిటీ మొత్తంగా మొత్తం రూ.42,30,000లను పొందవచ్చు.
మరోవైపు మీరు ఈ స్కీమ్‌లో 5 సంవత్సరాల పాటు రూ. 15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఇందులకు గాను వడ్డీ రేటు 8.2 ప్రకారం, మీకు 5 సంవత్సరాలలో వడ్డీగా రూ.6,15,000 పొందే అవకాశం ఉంది. మీరు త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీని గణిస్తే, ప్రతి మూడు నెలలకు రూ.30,750 వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా రూ. 15,00,000, వడ్డీ మొత్తాన్ని రూ.6,15,000 కలిపితే మొత్తం రూ. 21,15,000 మెచ్యూరిటీ అందుతుంది.
ఎవరు పెట్టుబడి పెట్టాలి?
60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా సరే ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. సివిల్ సెక్టార్ ప్రభుత్వ ఉద్యోగులు VRS తీసుకుంటారు. ఇలాంటి వారి రక్షణ నుంచి పదవీ విరమణ చేసే వ్యక్తులకు కొన్ని షరతులతో వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుందట. పథకం 5 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది కాబట్టి ఈ పథకం ప్రయోజనాలను 5 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగించాలనుకుంటే, డిపాజిట్ మొత్తం మెచ్యూర్ అయిన తర్వాత, మీరు ఖాతా వ్యవధిని మూడు సంవత్సరాల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. మెచ్యూరిటీ అయిన 1 సంవత్సరంలోపు పొడిగించుకోవచ్చు. అయితే మెచ్యూరిటీ తేదీలో వర్తించే రేటుతో పొడిగించిన ఖాతాపై వడ్డీ అందుతుంది అంటున్నారు నిపుణులు.