Homeలైఫ్ స్టైల్how many hours sleep is healthy : రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యకరం?...

how many hours sleep is healthy : రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యకరం? తక్కువైనా.. ఎక్కువైనా.. ఎలాంటి సమస్యలు?

how many hours sleep is healthy : మానవ శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. ప్రస్తుత కాలంలో రకరకాల కారణాలవల్ల కొంతమంది సరైన నిద్ర పోవడం లేదు. ఇంకొంతమంది రాత్రులు మెలకువతో ఉండి ఉదయం తొందరగా నిద్ర లేస్తున్నారు. దీంతో శరీరానికి సరైన నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఇటీవల చేసినా కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి వ్యక్తి 7 గంటల 18 నిమిషాల నిద్ర తప్పనిసరి అని అంటున్నారు. ఈ నిద్ర గడియారం తప్పితే ఇక కాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

ప్రముఖ వైద్య జర్నల్ అయిన బి.ఎం.జె ఓపెన్ డయాబెటిస్ రీసెర్చ్ అండ్ కేర్ లో ప్రచురించిన అధ్యయనంలో భాగంగా వేలాది మంది వ్యక్తుల నిద్ర అలవాట్లు వారి ఆరోగ్య పరిస్థితిలను పరిశోధకులు విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు . వీరి అధ్యయనం ప్రకారం రోజు సుమారు 7 గంటల 18 నిమిషాల నిద్ర శరీరంలో మెటబాలిజం సమతుల్యతను నిలబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది .ఈ సమయానికి తక్కువ లేదా ఎక్కువ నిద్ర పోతే శరీరంలోని గ్లూకోస్ నియంత్రణపై ప్రభావం పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు .

తక్కువ సమయం నిద్రపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పనిచేసే విధానం దెబ్బతినే ప్రమాద ఉంటుంది. దీనివల్ల ఇన్సిడెంట్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే శరీర కణాలు ఇన్సులిన్ కు సరిగా స్పందించకపోవడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల దీర్ఘకాలంలో శరీరంలో డయాబెటిస్ కు దారి తీసే అవకాశం ఉంటుంది. చాలామంది ఎక్కువగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు కానీ ఈ అధ్యయనం ప్రకారం అది కూడా ప్రమాదకరమే అని అంటున్నారు. అవసరానికి మించిన నిద్ర వల్ల గ్లూకోజ్ మెటబాలిజం దెబ్బ తినే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల శరీరంలో చక్కెర వినియోగం తగ్గి డయాబెటిస్ ప్రమాదం పెరగవచ్చు.

సరైన నిద్ర పోవడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యతలు ఏర్పడతాయి. అలాగే ఇన్సూరెన్స్ స్పందన మెరుగుపడుతుంది. గ్లూకోస్ స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. శరీరంలో మెటబాలిక్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అయితే ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్రపోవాలి. రాత్రి నిద్రపోయే గంట ముందు మొబైల్, టీవీకి దూరంగా ఉండాలి. అలాగే కెఫిన్ తో కూడిన పానీయాలను సేవించకుండా ఉండాలి. నిద్రపోయే ముందు కనీసం వాకింగ్ చేయడం వల్ల నాణ్యమైన నిద్ర పడుతుంది. మొత్తంగా చూస్తే సరైన నిద్ర శరీరానికి చాలా అవసరం అని వైద్య పరిశోధకులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఏడు గంటల 18 నిమిషాల కంటే ఎక్కువ లేదా తక్కువ అయినా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు నిద్ర గడియారాన్ని తప్పకుండా పాటించాలని చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular