
టీ20 వరల్డ్ అంతర్జాతీయ కప్ కోసం క్రికెట్ కౌన్సిల్ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ టోర్నమెంట్ కోసం 15 మంది ఆటగాళ్లు, 8 మంది అధికారులను తీసుకురావడానికి రాబోయే టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే దేశాలకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. 15 మంది ఆటగాళ్లు జాబితాతో పాటు కోచ్, సహాయక సిబ్బంది జాబితాను సెప్టెంబర్ 10 లోపు పంపాలని ఐసీసీ గడువు విధించినట్లు పీసీబీ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కరోనా ను దృష్టిలో పెట్టుకుని ఎంత మంది అదనపు ఆటగాళ్లను జట్టుతో ఉంచాలనుకుంటున్నారో కూడా నిర్ణయించుకోవాలని తెలిపినట్లు ఆయన చెప్పారు.