ఐఎఎస్ టాపర్లు అయిన టీనా దబీ, అథర్ ఖాన్ లకు జైపూర్ ఫ్యామిలీ కోర్టు ఎట్టకేలకు విడాకులు మంజూరు చేసింది. గత ఏడాది టీనాదబీ, అథర్ ఖాన్ లు విడాకులు కోరుతూ జైపూర్ కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్లు సమర్పించారు. 2015 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో టాపర్ అయిన టీనా దబీ, అథర్ ఖాన్ లు గతంలో ఒకరినొకరు ప్రేమించుకొని, వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ కేడర్ ఐఎస్ అధికారులైన ఈ దంపతులు పెళ్లి చేసుకున్న రెండేళ్ల తర్వాత జైపూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. టీనాదభీ, అథర్ ఖాన్ ల వివాహానికి పలువురు రాజకీయ నేతలు, ప్రముఖలు, అధికారులు హాజరైయ్యారు.