Hydra Alwal: హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇవాళ అల్వాల్ లో మూడు భవనాలను అధికారులు నేలకూర్చారు. చిన్నరాయన చెరువును కబ్జాదారులు ఆక్రమించినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు స్పందించి కబ్జాకు గురైన స్థలంలో ఆక్రమణలను తొలగించారు. దీంతో హైడ్రా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.