https://oktelugu.com/

Hyderabad Police Commissioner: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు బెదిరింపు

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ను ఓ వ్యక్తి బెదిరించాడు. అసభ్య పదజాలతో దూషించాడు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం సీపీ అంజనీకుమార్ పోలీసు కంట్రోల్ రూం సిబ్బందికి వాట్సాప్ ద్వారా రెండు మొబైల్ నంబర్లను షేర్ చేశారు. సదరు వ్యక్తి సమస్య ఏమిటో కనుక్కోవాలని సూచించారు. దీంతో కంట్రోల్ రూం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మురళీ ఓ నంబర్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 17, 2021 / 09:13 AM IST
    Follow us on

    హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ను ఓ వ్యక్తి బెదిరించాడు. అసభ్య పదజాలతో దూషించాడు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం సీపీ అంజనీకుమార్ పోలీసు కంట్రోల్ రూం సిబ్బందికి వాట్సాప్ ద్వారా రెండు మొబైల్ నంబర్లను షేర్ చేశారు. సదరు వ్యక్తి సమస్య ఏమిటో కనుక్కోవాలని సూచించారు. దీంతో కంట్రోల్ రూం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మురళీ ఓ నంబర్ కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి తన సమస్యను చెప్పుందుకు నిరాకరిస్తూ సీపీ అంజనీకుమార్ ను అసభ్య పదజాలతో దూషిస్తూ.. ఫోన్ కట్ చేశారు. దీంతో కానిస్టేబుల్ మురళీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.