
భాజపా నేత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపై రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల ఆ నియోజవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్ లో జరిపిన సంభాషణ బయటకొచ్చింది. హుజూరాబాద్ తెరాస టికెట్ తనకే ఖాయమైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని వారి ఖర్చులకు రూ. 2-3 వేలు ఇస్తానని అతడికి తెలిపారు. ఈ విషయం పై కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజేందర్ కు కౌశిక్ రెడ్డి సూచించారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ను కౌశిక్ రెడ్డి కలిశారు.