
ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లోని యాస్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించారు. ఒడిశాలోని భద్రాక్ బాలేశ్వర్ జాల్లాల్లో పశ్చిమ బెంగాల్ లోని పూర్బా మెడినిపూర్ లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం ఒడిశా, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు తక్షణ సాయం కింద రూ. 1,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. భువనేశ్వర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పునరావాస చర్యలకు సంబందించి సమీక్ష సమావేశం జరిగింది.