దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కు భారీ నష్టాలు వచ్చాయి. 2020-21 సంవత్సరంలో చివరి త్రైమాసికంలో ఏకీకృత నికర నష్టం రూ. 7,605 కోట్లు వచ్చినట్లు కంపెనీ ప్రకటించిది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన రూ. 9,849 కోట్ల నష్టంతో పోలిస్తే కొంచెం మెరుగుపడింది. ముఖ్యంగా జాగ్వర్ ల్యాండ్ రోవర్ కు సంబంధించి భారీ మొత్తం రైటాఫ్ జరగడంతో ఈ నష్టాలు వచ్చాయి. దీంతో పాటు జేఎల్ ఆర్ పునర్ వ్యవస్థీకరణకు అయిను రూ. 5,388 కోట్లు కూడా భారంగా మారాయి.