
కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్నీ స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో సినీ కార్మికులకు పూట గడవం కష్టంగా మారింది. పరిస్థితి తెలుసుకున్న ప్రముఖులు వారికి అండగా నిలుస్తూ నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ టీవీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. సినీ, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు రూ. 20 లక్షల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువుల కిట్లు అందించారు. ఈ మొత్తాన్ని 5వేల మంది సభ్యులకు నిత్యావసరాలు కోసం ఉపయోగిస్తామని తెలిపారు.