Horoscope Today: 2024 ఏప్రిల్ 12 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశివారు ప్రమాదకర పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కొత్త పరిచయాలు లాభిస్తాయి. లక్ష్యాలను సాధించడంలో దృష్టి పెడుతారు. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. ఇంతకాలం ఉన్న ఆందోళన తొలగిపోతుంది.
వృషభ రాశి:
ఈ రాశివారికి అనుకోని అదృష్టం కలిసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందేందుకు ప్రయత్నించాలి.
మిథునం:
శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితులను కలుస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో సహనం పాటించాలి. ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడితే నిర్లక్ష్యం చేయొద్దు.
కర్కాటకం:
ప్రమాదకర పనుల ప్రయత్నాలు మానుకోవాలి.నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. లేకుంటే అనారోగ్యాల పాలవుతారు. విద్యార్థులు కెరీర్ గురించి ఆందోళన చెందుతారు.
సింహ:
ఎక్కువగా వాదనలు చేయొద్దు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. కళాత్మక నైపుణ్యాలు సాధిస్తారు.
కన్య:
విదేశాల నుంచి ఓ శుభవార్త అందుకుంటారు. కుటుంబ సభ్యల్లో ఒకరితో గొడవ ఏర్పడవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తుల:
ఈ రాశివారు ఈరోజు శక్తివంతంగా ఉంటారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వస్తువుల కొనుగోలుకు ఆసక్తి చూపుతారు.
వృశ్చికం:
వ్యాపారులు పెద్ద లాభాలు పొందే అవకాశం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఎవరికైనా సాయం చేయడానికి ముందుకు వస్తారు. ఆరోగ్యంపై పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ప్రజలను ఆకర్షించే పనులు చేయడంలో విజయం సాధిస్తారు. ఇప్పటికే ఇచ్చిన కొన్ని వాగ్దానాలు నెరవేరుస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకర:
వైవాహిక జీవితం సంతోషంగా ఉటుంది. ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే పెద్ద సమస్యలు వస్తాయి. లక్ష్యానికి వ్యతిరేకంగా పనిచేయకూడదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి అధిక లాభాలు ఉంటాయి.
కుంభం:
న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. విద్యార్థులు భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు. పాత స్నేహితులు కలుస్తారు.
మీనం:
వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం. డబ్బు విషయాల్లో ఎవరినీ నమ్మొద్దు. ఉద్యోగులకు కార్యాలయాల్లో పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఏర్పడుతాయి.