Horoscope Today: 2024 ఏప్రిల్ 4న ద్వాదశ రాశులపై శ్రవణా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈనేపథ్యంలో ఓ రాశివారు శత్రవులతో జాగ్రత్తగా ఉండాలి.. మరో రాశి వారికి ఆకస్మిక ఆదాయం పెరగుతుంది. గురువారం చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో చిత్తశుద్ధితో పనిచేస్తారు. శత్రువులు మీ పనికి ఆటంకం సృష్టిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
వృషభ రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయొద్దు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
మిథునం:
ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. విహార యాత్రలకు వెళ్లే అవకాశం. స్నేహితులను కలుస్తారు.
కర్కాటకం:
ఆకస్మిక లాభాలు ఉంటాయి. కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని తప్పులకు పశ్చాత్తాపం పడుతారు.
సింహ:
పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొన్ని పర్సనల్ విషయాలు బయటి వ్యక్తులతో పంచుకోవద్దు. పాత స్నేహితులను కలుస్తారు. ఓ పని కారణంగా అలసిపోతారు.
కన్య:
కుటుంబ సభ్యుల సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి. ఇతరులతో సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కోపానికి దూరంగా ఉండాలి.
తుల:
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. కొన్ని పొరపాట్లు ఇతరులకు ఇబ్బందిని కలిగించవచ్చు. విహార యాత్రలకు వెళ్లే అవకాశం. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:
ఆదాయం పెరుగుతంది. ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. వ్యాపార సంబంధాలు మెరుగుపడుతాయి. స్నేహ పూర్వక వాతావరణంలో ఉంటరు. పాత అప్పులు తీరుస్తారు.
ధనస్సు:
చట్ట పరమైన వివాదాలు ఎదుర్కొంటారు. కొందరు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతారు. ఒక సమస్యపై ఎక్కువగా వాదనలు చేస్తారు. జీవిత భాగస్వామితో సమస్యలు ఉంటాయి.
మకర:
ఈ రాశివారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఓ స్నేహితుడి ఇంటికి వెళ్తారు. వ్యాపార ప్రణాళికలో మార్పులు దెబ్బ తినొచ్చు..
కుంభం:
ఈ రాశి వారు వివిధ పనుల కారణంగా బిజీగా ఉంటారు. బడ్జెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులకు అప్పు ఇవ్వొద్దు.
మీనం:
కొత్త పథకాల నుంచి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సమస్యలను పంచుకుంటారు. మానసిక భారం నుంచి ఉపశమనం పొందుతారు.