Horoscope Today: 2025 మే 1 బుధవారం రోజున ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కుంభ రాశిలో సంచరించనున్నాడు. అలాగే గురుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. మరో రాశి వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పుడుతాయి.
వృషభ రాశి:
ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది.
మిథునం:
ఈ రాశి వారు ఈ రోజంతా ఉల్లాసంగా ఉంటారు. కొందరికి వారసత్వ ఆస్తి లభిస్తుంది. ఉద్యోగులు పదోన్నతి విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహా తీసుకోవాలి.
కర్కాటకం:
ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగుల పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి.
సింహ:
ఈ రాశి వారు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. కొన్ని సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగులు బిజీ వాతావరణంలో ఉంటారు.
కన్య:
వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కొన్ని విషయాలో ఉద్యోగులు ప్రగతి సాధిస్తారు. అనుకోని ఆదాయం వస్తుంది.
తుల:
ఈ రాశివారికి కొన్ని సమస్యలు వస్తాయి. ఏ విషయంలనైనా తొందరపడి మాట్లాడొద్దు. ఆర్థికంగా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు ప్రయత్నించాలి.
వృశ్చికం:
ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి జీవితం సంతోషంగాఉంటుంది. వ్యాపారులు కొన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. ఉద్యోగులు ఏదంటే అదవుతుంది.
ధనస్సు:
సమాజంలో సంబంధాలు మెరుగుపడుతాయి. కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి.
మకర:
గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవితం ఆనందంగా గడుస్తుంది. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. కుటుబ సభ్యుల ఆశీస్సులు ఉంటాయి.
కుంభం:
చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి ప్రశంసలు పొందుతారు. దీంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
మీనం:
కొందరు మీపై చేసే వ్యాఖ్యల వల్ల బాధ కలుగుతుంది. అందువల్ల కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో విజయం కోసం ప్రయత్నించాలి.