Horoscope Today: 2025 మే 3 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై శతబిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కుంభ రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మరో రాశి ఉద్యోగులు వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వ్యాపారులకు కొంత అనిశ్చితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
వృషభ రాశి:
ఆరోగ్యపరమైన సమస్యలపై దృష్టి పెట్టాలి. వ్యాపార ఒప్పందాలలో ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
మిథునం:
కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఇస్తాయి. లక్ష్యంపై దృష్టి పెడుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
కర్కాటకం:
ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఇతరులతో ఎక్కువగా వాగ్వాదానికి దిగకూడదు.
సింహ:
జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కొత్త వ్యక్తులను అంతగా నమ్మొద్దు. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఇతరుల ప్రయోజనాలు చూస్తారు. పిల్లల కెరీర్ పై దృష్టి పెడుతారు. కుటుంబ సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు.
తుల:
కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు అనుకున్న పనులను నెరవేర్చుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ప్రశాంతమైన జీవితం గడుపుతారు.
వృశ్చికం:
ఇతరుల నుంచి బహుమతులు స్వీకరిస్తారు. బయటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా ఇతరుల సాయం తీసుకోవాలి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.
ధనస్సు:
వాగ్దానాలను నెరవేరుస్తారు. కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.ఉద్యోగులు కార్యాలయాల్లో బిజీగా ఉంటారు.
మకర:
ఖర్చులపై నియంత్రణ ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడొద్దు.
కుంభం:
ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆందోళనతో ఉంటారు. సకాలంలో పనులు పూర్తి చేయండి. స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తారు.
మీనం:
కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కొత్తవారికి డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఖర్చులపై నియత్రణ ఉండాలి.