Horoscope Today: 2025 మే 2 గురువారం రోజున ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కుంభ రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారు కొన్ని పనుల కోసం కష్టపడాల్సి వస్తుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈరాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా అడ్డంకులు జరుగుతాయి. ఖర్చులపై శ్రద్ద వహించాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
కొన్ని పనుల కోసం కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొందరు ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టొచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
మిథునం:
పెండింగులో ఉన్న పనులు ఈరోజుతో పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు.
కర్కాటకం:
కొన్ని మాటల వల్ల సమాజంలో వ్యతిరేకత ఉండొచ్చు. మీ ఆలోచనలు ఇతరులను ఇబ్బంది పెడుతాయి. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఖర్చులను నియంత్రించాలి.
సింహ:
శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా పనిచేస్తారు. ఉల్లాసంగా ఉంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రు ఆశీస్సులు ఉంటాయి.
కన్య:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రణాళికతో వ్యాపారాన్ని ప్రారంభించాలి. మీ ఆలోచనలు సంతోషాన్ని ఇస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
తుల:
ఈ రాశి వారు కొన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులు కెరీర్ పై దృష్టి పెడుతారు. ఇతరులకు సాయం చేస్తారు.
వృశ్చికం:
కొన్ని పనుల వల్ల నిరుత్సాహంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. పాత సమస్యలు ఈరోజుతో తొలగిపోతాయి.
ధనస్సు:
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారంలో కొంత లాభం పొందవచ్చు. ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. క్రమశిక్షణతో మెదలడం వల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది.
మకర:
కొన్ని ప్రత్యేక పనులపై ఫోకస్ పెట్టాలి. ఇంట్లో ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు రాజకీయాలకు దూరంగా ఉండాలి. కొన్ని రంగాల వారికి అధిక లాభాలు ఉంటాయి.
కుంభం:
ఉద్యోగులు కార్యాలయాల్లో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తుువులు కొనుగుల చేయొచ్చు. మీ కల నెరవేర్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు వస్తాయి.
మీనం:
కొన్ని శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణ ఉంటుంది.