Horoscope Today: 2024 మార్చి 29న ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా కర్కాటక రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలను ఎదుర్కొంటారు. కొన్ని రాశుల వారికి శుభఫలితాలు రానున్నాయి. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు ప్రణాళికల ప్రకారంగా ముందుకు వెల్లాలి. ఉద్యోగులు చాకచక్యంగా ఉంటేనే మనుగడ ఉంటుంది.
వృషభ రాశి:
ఈ రాశివారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సలహాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో ఆందోళనగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి.
మిథునం:
ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని పనుల్లో నిరాశను ఎదుర్కొంటారు. ఇతరుల నమ్మకాన్ని గెలుచుకుంటారు.
కర్కాటకం:
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అదనపు ఖర్చులు పెరుగుతాయి. అప్పులను తిరిగి చెల్లించడంలో సక్సెస్ అవుతారు. ఎవరితోనైనా ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి.
సింహ:
పాత స్నేహితులను కలుస్తారు. కొందరు వీరిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. పెండింగులో ఉన్న డబ్బు తిరిగి చేరుతుంది. వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
కన్య:
ఈ రాశివారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కటుుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. చాలా కాలంగా పెండింగులో ఉన్న ఓ అవసరం నేటితో తీరుతుంది.
తుల:
కొన్ని విషయాల్లో ఆకస్మిక అదృష్టం పొందుతారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. వివిధ మార్గాల నుంచి ఆదాయం వస్తుంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం:
శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలు పాటించాలి. ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం. ఓ విషయం తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది.
ధనస్సు:
ఉద్యోగులు కార్యాలయాల్లో సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. వ్యాపారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
మకర:
కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వర్గాల వారు అధిక లాభాలు పొందుతారు. బడ్జెట్ కు అనుగుణంగా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. డబ్బును పొదుపుగా వాడుకోవాలి.
కుంభం:
చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన సమాచారాన్ని ఆందోళన కలిగిస్తుంది. కళా రంగానికి చెందినవారు కొన్ని బహుమతులు అందుకుంటారు.
మీనం:
సన్నిహితులతో ఆనందంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ వేస్తారు. లాభాలు ఉంటాయి. సౌకర్యాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.