spot_img
Homeఅంతర్జాతీయంHistory of Gas Discovery: గ్యాస్‌ పుట్టింది ఇలా.. ఆవిష్కరణ రహస్యం ఇదీ!

History of Gas Discovery: గ్యాస్‌ పుట్టింది ఇలా.. ఆవిష్కరణ రహస్యం ఇదీ!

History of Gas Discovery: పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశంలో వంటగ్యాస్‌ సరఫరా తగ్గింది. దీంతో ప్రజలు కష్టపడుతున్నారు. నగరాలు, పట్టణాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు మూతపడుతున్నాయి. డొమెస్టిక్‌ గ్యాస్‌ కోసం కూడా జనం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. బుకింగ్‌లు భారీగా పెరిగాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గ్యాస్‌ ఎలా పుట్టిందో మీకు తెలుసా.. ఎవరు గుర్తించారు. ఎలా నిల్వ చేస్తున్నారు. ఎన్నేళ్లుగా గ్యాస్‌ ఉత్పత్తి జరుగుతోంది అనే వివరాలు తెలుసుకుందాం.

పెట్రోల్‌ లీకేజీ రహస్యం
1910లో అమెరికాలో ఒక మోటారిస్ట్‌ కారు ట్యాంక్‌లో పెట్రోల్‌ వినియోగించకపోయినా తగ్గుతున్న సమస్యను ఎదుర్కొన్నాడు. లీకేజీ లేకపోయినా ఇంధనం ఎలా తగ్గుతోందో తెలుసుకోవాలనుకున్నాడు. యువ కెమిస్ట్‌ వాల్టర్‌ స్నెల్లింగ్‌ను ఆశ్రయించాడు. ఆయన అనేక పరిశోధనలు చేసి పెట్రోల్‌లోని అస్థిర గ్యాస్‌లు(ప్రొపేన్, బ్యూటేన్‌) కారణమని కనుగొన్నాడు. ఈ తేలికైన వాయువులు ఆవిరిగా గాల్లో కలిసిపోతున్నాయని గుర్తించాడు.

గ్యాస్‌ ద్రవీకరణ ఆవిష్కరణ
స్నెల్లింగ్‌ పెట్రోల్‌ అవశేషాలను ల్యాబ్‌లో వేరు చేసి, ఈ గ్యాస్‌లు అధిక మండటం, తక్కువ బరువుతో ఉన్నాయని నిర్ధారించాడు. హై ప్రెషర్‌లో చల్లబరిచి లోహ కంటైనర్లలో నిల్వ చేయొచ్చని గుర్తించాడు. ఇలా ద్రవ రూపంలో పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) ప్రపంచానికి పరిచయమైంది. మొదట్లో పరిశ్రమలకు వినియోగించారు.

Also Read: వంటగ్యాస్‌ సరఫరా.. కేంద్ర కీలక సూచనలు

డొమెస్టిక్‌గా మార్పు..
కొన్ని కంపెనీలు స్నెల్లింగ్‌ ఐడియాను వాణిజ్యీకరించి సిలిండర్లలో సరఫరా ప్రారంభించాయి. హీటింగ్‌ నుంచి వంటలకు వాడకం పెరిగింది. నగరీకరణతో శుద్ధ ఇంధనంగా ఎల్‌పీజీ ఇంటింటికీ చేరింది, ప్రస్తుతం మన రోజువారీ జీవితంలో కీలక భాగం.

ఎవరీ స్నెల్లింగ్‌
1880లో జన్మించిన స్నెల్లింగ్, ఇంధన రసాయనాలపై పరిశోధనలతో ప్రసిద్ధి చెందాడు. 1965లో మరణించినా, అతని కనుగొన్న ఎల్‌పీజీ ప్రపంచ ఇంధన వాడకాన్ని మార్చింది. ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభంతో సరఫరా సమస్యలు తలెత్తినా, ఈ ఆవిష్కరణ మన వంటలకు ఆధారం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
Oktelugu Epaper