Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో 15కి చేరిన మృతులు
హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. శుక్రవారం ఉదయం మరో రెండు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. దీంతో మృతులు 15కు చేరారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. బుధవారం మధ్యాహ్నం కిన్నౌర్ జిల్లాలోని నిగుల్ సేరి ప్రాంతంలో ఎన్ హెచ్-5 పై కొండచరియల విరిగి వాహనాలపై పడిన విషయం తెలిసిందే. పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు దూసుకొచ్చి.. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుతోపాటు ఇతర వాహనాలపై పడ్డాయి. […]
హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. శుక్రవారం ఉదయం మరో రెండు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. దీంతో మృతులు 15కు చేరారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. బుధవారం మధ్యాహ్నం కిన్నౌర్ జిల్లాలోని నిగుల్ సేరి ప్రాంతంలో ఎన్ హెచ్-5 పై కొండచరియల విరిగి వాహనాలపై పడిన విషయం తెలిసిందే. పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు దూసుకొచ్చి.. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుతోపాటు ఇతర వాహనాలపై పడ్డాయి. దీంతో ఆర్టీసీ బస్సు రోడ్డుపై నుంచి కొట్టుకుపోయి లోయలో పడిపోయింది.