Etela vs Harish: ఫస్ట్ ఈటల.. నెక్ట్స్ హరీష్ యేనట..

అవసరం ఉన్నంత వరకు ‘ఓడ మల్లన్న’.. అవసరం తీరాక ‘బోడి మల్లన్న’ అన్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) తీరు ఉంటుందని రాజకీయవర్గాల్లో ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే తనతోపాటు టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి ఉన్న సహచర ఉద్యమకారులు ఎవరూ ఇప్పుడు టీఆర్ఎస్ లో లేరు. నాడు ఆలె నరేంద్ర, విజయశాంతి నుంచి నేటి ఈటల రాజేందర్ (Etela Rajendar) వరకూ అందరినీ పొగబెట్టి కేసీఆర్ పంపిచేశారని.. తనకు ఎదురు లేకుండా చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ […]

Written By: NARESH, Updated On : August 13, 2021 10:55 am
Follow us on

అవసరం ఉన్నంత వరకు ‘ఓడ మల్లన్న’.. అవసరం తీరాక ‘బోడి మల్లన్న’ అన్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) తీరు ఉంటుందని రాజకీయవర్గాల్లో ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే తనతోపాటు టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి ఉన్న సహచర ఉద్యమకారులు ఎవరూ ఇప్పుడు టీఆర్ఎస్ లో లేరు.

నాడు ఆలె నరేంద్ర, విజయశాంతి నుంచి నేటి ఈటల రాజేందర్ (Etela Rajendar) వరకూ అందరినీ పొగబెట్టి కేసీఆర్ పంపిచేశారని.. తనకు ఎదురు లేకుండా చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ తాజాగా టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పంపించే ఆ ఉద్యమకారుడు ఎవరన్నది బయటపెట్టాడు. అది ఎవరో కాదు.. మంత్రి హరీష్ రావుయేనట..

హుజూరాబాద్ లో నిన్నటి నుంచి వీరవిహారం చేస్తూ తన పాత సహచరుడు ఈటల రాజేందర్ ను ఓడించడానికి కంకణం కట్టుకున్న హరీష్ రావుపై మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీ మామ కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని నన్ను తిడుతున్నావ్.. కానీ ఎప్పటికైనా నాలెక్కనే నీ పని అయితది.. టీఆర్ఎస్ లో ముగుస్తుదని గుర్తు పెట్టుకో’ అని బీజేపీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లోనే హరీష్ రావును దూరం పెట్టి కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు కేసీఆర్. కేబినెట్ లోకి తీసుకోకుండా సతాయించాడు. నాడు పార్టీ చీలిపోతుందా? అన్న అనుమానాలు కలిగాయి. కానీ అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడితో కేసీఆర్ వెనక్కి తగ్గి హరీష్ రావుకు ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇచ్చాడు. అప్పుడే హరీష్ బయటకు వెళతాడని ప్రచారం జరిగినా అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి.

అయితే హరీష్ రావుకు మాత్రం మామ కేసీఆర్ పై నమ్మకం ఉంది. తాను టీఆర్ఎస్ వీడనని ఎప్పుడో స్పష్టం చేశాడు. మరి ఈ ప్రేమ కేసీఆర్ కు ఉందా? లేదా? అన్నది వేచి చూడాలి.