Hema Malini : మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం బయోపిక్స్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వేలకోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాయి. అయితే కొన్ని బయోపిక్స్ మాత్రం విఫలం అయ్యాయి. ఎందుకంటే ఆడియన్స్ ఒక బయోపిక్ కి కనెక్ట్ అవ్వాలంటే , హై ఇచ్చే సన్నివేశాలు ఎన్ని ఉండాలో , కంటతడి పెట్టించే సన్నివేశాలు కూడా అన్ని ఉండాలి. ఆద్యంతం భజన చేసేలా ఉన్నవి ఫ్లాప్ అయ్యాయి. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉన్నప్పుడే బయోపిక్స్ వర్కౌట్ అవుతాయి. అలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా అనిపించే బయోపిక్ హేమ మాలిని సొంతం. బాలీవుడ్ లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ లో నటించి , లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన ఈ సినీ జీవిత ప్రయాణం గురించి కచ్చితంగా నేటి తరం ప్రేక్షకులు తెలుసుకోవాల్సిందే.
అయితే ఇలాంటి లెజండరీ హీరోయిన్ రోల్ ని వెండితెర పై పోషించగల సత్తా ఉన్న హీరోయిన్ దీపికా పదుకొనే. హేమ మాలిని పాత ఫోటోలను చూస్తే, కాస్త దీపికా పదుకొనే లాగానే ఉంటుంది. ప్రస్తుతం ఈమె బీజేపీ పార్టీ ఎంపీ గా కొనసాగుతోంది. రీసెంట్ గానే ముంబై లో ‘డ్రీం గర్ల్స్ డైమండ్ జూబ్లీ’ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న హేమమాలిని తన జీవితం లోని అనేక సంఘటనలను పంచుతుంది. ఈ ఈవెంట్ లో ఒక మీడియా రిపోర్టర్ మీ బయోపిక్ లో హీరోయిన్ గా నటిస్తే ఎవరు బాగుంటుంది అని అడగ్గా, హేమమాలిని క్షణం కూడా ఆలోచించకుండా దీపికా పదుకొనే పేరు చెప్పుకొచ్చింది. దీపికా చాలా అందమైన అమ్మాయి , అద్భుతంగా నటించలేదు , కేవలం ఆమె మాత్రమే నా బయోపిక్ కి న్యాయం చేయగలదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి అయితే ఈ బయోపిక్ ఎలాంటి కార్యరూపం దాల్చలేదు కానీ , త్వరలోనే మేకర్స్ ఈ బయోపిక్ ని తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.
హేమ మాలిని బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ ధర్మేంద్ర డియోల్ ని పెళ్లాడింది. వీళ్లిద్దరికీ ఈషా డియోల్, అహనా డియోల్ అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ధర్మేంద్ర డియోల్ గతం లో ప్రకాష్ కౌర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలే సన్నీ డియోల్ , బాబీ డియోల్. ఇక ఆ తర్వాత హేమ మాలిని ని రెండవ పెళ్లి చేసుకున్నారు ధర్మేంద్ర. రీసెంట్ గానే ధర్మేంద్ర చనిపోయిన సంగతి తెలిసిందే. సన్నీ డియోల్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగారు , బాబీ డియోల్ కూడా హీరో గా సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా కొనసాగుతున్నారు.
