
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం, విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ జలాశయం వద్ద నల్గొండ జిల్లా పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నల్గొండ జిల్లా ఎస్సీ రంగనాథ్ సాగర్ జలాశయం వద్దకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద ఎస్పీఎఫ్ సిబ్బందితో పాటు ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్ఐలు, 100 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.