ఉత్తరాఖండ్ కు భారీ వర్ష సూచన
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున డెహ్రుడూన్ జిల్లా ఛక్రతా పరిధి బ్రినాద్ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరదలు సంభవించి నలుగురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర విపత్తు స్పందనా దళం ఇప్పటికే రంగంలోకి దిగింది. రానున్న 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉండటంతో వాతావరశాక రెడ్ అలర్జ్ జారీ చేసింది. ఉత్తరకాశీ, చమోలీ, భాగేశ్వర్, అల్మోరా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ […]
Written By:
, Updated On : May 20, 2021 / 02:40 PM IST

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున డెహ్రుడూన్ జిల్లా ఛక్రతా పరిధి బ్రినాద్ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరదలు సంభవించి నలుగురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర విపత్తు స్పందనా దళం ఇప్పటికే రంగంలోకి దిగింది. రానున్న 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉండటంతో వాతావరశాక రెడ్ అలర్జ్ జారీ చేసింది. ఉత్తరకాశీ, చమోలీ, భాగేశ్వర్, అల్మోరా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.