ఆంధప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగం తర్వాత 2021-22 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2,29,779 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఇందులో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు, వైఎస్సార్ పెన్షన్ వంటి పథకాలకు భారీగా నిధులు కేటాయించారు.
ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. దృఢ నిశ్చయంతో సవాళ్లను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. కరోనా పరిస్థితుల్లో.. ఓవైపు ప్రజల ప్రాణాలు కాపాడుతూనే.. ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కాగా.. బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఒక్కరోజే కొనసాగనున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏయే రంగాలకు కేటాయింపులు ఎలా ఉన్నాయంటే…
వైద్యం, ఆరోగ్యం – 13,830 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా – 3845 కోట్లు
జగనన్న వసతి దీవెన – 2,223.15 కోట్లు
శిశు సంక్షేమం, అభివృద్ధి – 16,748 కోట్లు
మహిళాభివృద్ధి – 47,283 కోట్లు
వ్యవసాయ పథకాలు – 11,210 కోట్లు
విద్యా పథకాలకు – 24,624 కోట్లు
వైఎస్ఆర్ పింఛన్ కానుక – 17,000 కోట్లు
వైఎఆర్ పీఎం ఫసల్ భీమా యోజన – 1,820 కోట్లు
అమ్మొడి – 6,107 కోట్లు
హౌసింగ్ మౌలిక సదుపాయాలు – 5,661 కోట్లు
ఈబీసీ సంక్షేమం – 5,478 కోట్లు
కాపు సంక్షేమం – 3,306 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమం – 359 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ – 17,403 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్ – 6,131 కోట్లు
మైనారిటీ యాక్షన్ ప్లాన్ – 3840 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపులకు – రూ.500 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద చెల్లింపులకు – 1,112 కోట్లు
వైఎస్సార్ జగనన్న చేదోడు పథకం – రూ.300 కోట్లు
వైఎస్సార్ వాహన మిత్ర పథకం – 285 కోట్లు
వైఎస్సార్ నేతన్న నేస్తం – 190 కోట్లు
వైఎస్సార్ మత్స్యకార భరోసా – 120 కోట్లు
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం – 50 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల కోసం – 200 కోట్లు
రైతులకు ఎక్స్ గ్రేషియా – 20 కోట్లు,
వైఎస్సార్ ఆసరా – 6,337 కోట్లు
అమ్మఒడి – 6,107 కోట్లు
వైఎస్సార్ చేయూత – 4,455 కోట్లు