Hyderabad Rain: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యహ్నం భారీ వర్షం కురిసింది. బోరబండ, అమీర్ పేట, బంజారాహిల్స్ లో మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై వర్షం నీరు నిలిచింది. వాహనదారులు వర్షానికి తడిసిముద్దయ్యారు. ద్విచక్రవాహనదారులు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల కింద ఆగిపోయారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి.