
క్రికెట్ గ్రౌండ్ లో మరో ప్లేయర్ తీవ్రంగా గాయపడ్డారు. ఫీల్డింగ్ చేస్తూ మరో ప్లేయర్ ను ఢీకొట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ డుప్లెన్సిని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్ టీమ్ తరఫున ఆడుతున్న ఉుప్లెస్సీ లాంగాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పెషావర్ జాల్మీ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ లాంగాన్ బౌండరీ వైపు దూసుకెళ్లగా ఉప్లెస్సి డైవ్ చేశాడు. అదే సమయంలో లాంగాఫ్ నుంచి మరో ప్లేయర్ మహ్మద్ హస్నెైన్ దూసుకొచ్చాడు. ఈ క్రమంలో అతని మోకాలు డుప్లెస్సి తలకు బలంగా తగిలింది. దీంతో అతడు కుప్పకూలాడు. వెంటనే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు టీమ్ వెల్లడించింది.