
ప్రపంచకప్ మ్యాచుల్లో నెర్వస్ నెస్ పోగొట్టుకొనేందుకు నిపుణులు, కోచ్ లు ఇచ్చే సలహాలు ఆటగాళ్లు పాటించడం తెలిసిందే. అయితే 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో టీమ్ ఇండియా ఆటగాళ్లకు అప్పటి మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్ ఓ వింత సూచన చేశాడట. మ్యాచ్ లకు ముందు శృంగారంలో పాల్గొనాలని చెప్పాడట. దాంతో అప్పటి కోచ్ గ్యారీ కిర్ స్టన్ కు నోట మాట రాలేదట. ఈ విషయాలను ప్యాడీ అప్టన్ తన ఆత్మకథ ది బేర్ ఫూట్ కోచ్ పుస్తుకంలో రాశాడు. శృంగారం చేయాలన్న సలహా ఇచ్చినందుకు ఆ తర్వాత క్షమాపణ తెలియజేశానని ఆప్టన్ వివరించాడు.